గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న 111వ సినిమా చిత్రీకరణ ఈ వారం ముంబయిలో ప్రారంభం కానుంది. వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన కాజల్ నటిస్తున్నారు. 'వీరసింహారెడ్డి' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ కమర్షియల్ అంశాలతో రూపొందుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, పోరాట ఘట్టాలు చిత్రీకరించనున్నారు.