
మంగళూరులో శ్రీకాకుళం మత్స్యకారులపై దాడి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం కర్ణాటకలోని మంగళూరు వెళ్లగా, అక్కడ మంగళూరు మత్స్యకారులు వారి బోటును ఢీకొట్టి, ఆపై దాడి చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో జెట్టి, ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్లే వలస వెళ్లాల్సి వస్తోందని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




