
మహిళ, ఆమె సోదరుడిని హత్య చేసిన ప్రేయసి కుమారుడు
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. బెంగళూరులోని పీన్యా పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మల్లే గౌడ అనే వ్యక్తికి ఛాయా అనే మహిళతో ఎఫైర్ ఉంది. భర్త సంబంధం గురించి తెలుసుకున్న భార్య యమున, బావమరిది సుదీప్ ఛాయాను నిలదీయడానికి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఛాయా కుమారుడు కత్తితో సుదీప్, యమునలపై దాడి చేశాడు. దీంతో వారిద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.




