
లోకేష్ రెడ్ బుక్కు మా కుక్క కూడా భయపడదు: అంబటి రాంబాబు
మాజీ మంత్రి నారా లోకేష్ తన రెడ్ బుక్‌తో తనను భయపెట్టలేరని, తన కుక్క కూడా భయపడదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ తనను జైల్లో పెట్టినా, దొంగ కేసులు పెట్టినా, పోలీసులతో కొట్టిచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని, అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే.. దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదని హెచ్చరించారు.




