
ఫోర్బ్స్ కుబేరుల జాబితా.. మళ్లీ ముకేశ్ నంబర్-1
ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద $105 బిలియన్, గతేడాదితో పోలిస్తే 12% తగ్గింది. రెండో స్థానంలో గౌతమ్ అదానీ ($92 బిలియన్), మూడో స్థానంలో సావిత్రి జిందాల్ ($40 బిలియన్), నాలుగో స్థానంలో సునీల్ మిట్టల్ ($34 బిలియన్), ఐదో స్థానంలో శివ నాడార్ ($33 బిలియన్) ఉన్నారు. మొత్తం దేశీయ కుబేరుల సంపద విలువ 9% తగ్గి $1 ట్రిలియన్ కు చేరింది.




