
సాంబారులో జెర్రీ.. పట్టించుకొని సిబ్బంది
TG: నల్లగొండ పట్టణంలోని ఒక హోటల్లో ఒక వ్యక్తి తాను తిన్న సాంబార్లో జెర్రీని గమనించాడు. దీనిపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు తేలికగా తీసుకున్నారు. ఈ ఘటనతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో ప్రముఖులుగా చెప్పుకునేవారు కూడా తరచుగా ఈ హోటల్లోనే టిఫిన్స్ చేస్తారని సమాచారం.




