TG: హైదరాబాద్‌లో విడి నూనె అమ్మకాలపై H-Fast అధికారులు నిషేధం విధించారు. విడి నూనె విక్రయాలకు 15 రోజుల గడువు ఇచ్చారు. గడువు తర్వాత విక్రయాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి నూనె ప్యాకెట్ సీల్ చేసి, తయారీ, ఎక్స్పైరీ తేదీ, బ్యాచ్ నంబర్, FSSAI లేబులింగ్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కల్తీ నూనె దొరికితే లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని తెలిపారు. ప్రజలు తక్కువ ధరకు దొరికే విడి నూనెను కొనవద్దని పోలీసులు సూచించారు.