చైనా మాంజా వాడకంపై నిషేధం.. శిక్షలు తప్పవు!

35చూసినవారు
చైనా మాంజా వాడకంపై నిషేధం.. శిక్షలు తప్పవు!
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో.. పిల్లలు, యువకులు పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తారు. ఈ సమయంలో, ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వాడకంపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా తయారీలో సీసం వంటి పదార్థాలు వాడటం వల్ల అది మెరుస్తూ, సన్నగా కనిపిస్తుంది. దీని వాడకం వల్ల మెడ, చేతులు, చెవి వంటి సున్నితమైన ప్రదేశాల్లో తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా కొత్త చట్టం ప్రకారం శిక్షలు తప్పవని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్