ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు ఇవాళ తలపడ్డాయి. తొలుత మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో జీషన్ అలీ 30, నిజాకత్ ఖాన్ 42, ముర్తాజా 29 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్, టస్కిన్, హుస్సేన్ తలో రెండేసి వికెట్ తీసుకున్నారు. బంగ్లా విజయానికి 144 పరుగులు కావాలి.