
పీఎం కిసాన్ 24వ విడత.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే!
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 24వ విడత సాయం పంపిణీకి సిద్ధమైంది. అక్టోబర్ నెలలో దసరా కానుకగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 20న 23వ విడత అందించిన తర్వాత, నాలుగు నెలల గడువు పూర్తయ్యే అక్టోబర్లో 24వ విడత నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిధులు అందుకోవాలంటే రైతులు ఈకేవైసీ, ఆధార్ అనుసంధానం, భూమి రికార్డుల పరిశీలన, ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు వంటి పనులు పూర్తి చేసుకోవాలి.




