TG: బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఏ పార్టీ వ్యక్తి అయినా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, విధ్వంసాన్ని ప్రోత్సహించేలా మాట్లాడొదని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేయాలన్నారు. అధికారం పోగానే BRS నేతలు నిరాశలో ఉన్నారని, పైసల కోసం BRS విలవిల్లాడుతోందని ఆరోపించారు. పైసలు వసూలు చేయడానికే.. సింగరేణి ఆఫీసులు తగులబెట్టాలంటున్నారని విమర్శించారు.