TG: ఇటీవల ఓ పాస్టర్ బజారు మహిళలే మల్లె పువ్వులు పెట్టుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం చేశారు. మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దీనిపై తెలుగు రాష్ట్రాల మహిళలు ఫిర్యాదు చేయడం గర్వించదగ్గ విషమయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను అవమానిస్తే సహించమని పేర్కొన్నారు.