
కోఠి మహిళా వర్శిటీలో విద్యార్థినులకు వేధింపులు.. ఆడియో వైరల్
TG: హైదరాబాద్ కోఠి మహిళా వర్శిటీలో పీజీ విద్యార్థినులు వేధింపులకు గురైనట్లు ఆడియో వైరల్ అవుతోంది. మెస్ ఇన్‌ఛార్జి వినోద్ వేధిస్తున్నారని విద్యార్థినులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసిన తెలుస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రిన్సిపల్ సైతం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమ పేర్లు బయటపెట్టొద్దని విద్యార్థినులు ఆ ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిర్యాదు ఆడియో వైరల్ అవుతోంది.




