
కన్న తల్లిదండ్రులను చంపానని టీవీ షోలో చెప్పిన కొడుకు (వీడియో)
అమెరికాలో సంచలనం రేకెత్తించిన ఘటనలో, లోరెంజ్ క్రాస్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులను ఎనిమిదేళ్ల క్రితం తానే హత్య చేసి, వారి మృతదేహాలను ఇంటి వెనుక పాతిపెట్టినట్లు టీవీ షోలో ఒప్పుకున్నాడు. గురువారం జరిగిన ఈ ఇంటర్వ్యూ తర్వాత, స్టూడియో నుంచి బయటకు రాగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అల్బానీలోని అతని ఇంటి నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్రాస్ తన తల్లిదండ్రుల బాధల పట్ల ఆందోళనతో ఈ పని చేసినట్లు పేర్కొన్నాడు.




