బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జూలై–ఆగస్టు ఆందోళనల్లో 1,400 మంది మరణించగా, నిరసనకారులపై కాల్పులు జరపాలని హసీనా ఆదేశించిందని కోర్టు పేర్కొంది. హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించినట్లు కూడా తీర్పులో ప్రస్తావించారు. తీర్పు నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ ప్రకటించగా, అల్లర్లకు ప్రయత్నిస్తే షూట్ ఎట్ సైట్ ఆదేశాలు కూడా జారీ చేస్తామని అధికారులు తెలిపారు.