
కురుపాం గురుకుల స్కూల్ ఘటన.. HRCకి వైసీపీ ఫిర్యాదు (వీడియో)
AP: కురుపాం గురుకుల స్కూల్లో హెపటైటిస్-ఏతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, 170 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటనపై వైసీపీ నాయకులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, బాధిత కుటుంబాలకు ₹25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, పుష్పశ్రీవాణి, రాజన్నదొర, భాగ్యలక్ష్మి మాధవి తీవ్రంగా విమర్శించారు.




