మీరు బ్యాంకు ఖాతాను 10 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, ఆ ఖాతా డీయాక్టివ్ అవుతుంది. అందులోని మొత్తం ఆర్బీఐ ఏర్పాటు చేసిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కి బదిలీ అవుతుంది. గత ఏడాది మే 24 నుంచి ఈ ఫండ్ అమల్లోకి వచ్చింది. దేశంలో 10 ఏళ్లకు పైగా ఉపయోగించని ఖాతాల్లోని డబ్బులు ఇప్పుడంతా ఈ ఫండ్‌లో ఉన్నాయి. మీ డబ్బు తిరిగి పొందాలంటే udgam.rbi.org.in/unclaimed-deposits పోర్టల్‌లో పాన్, ఆధార్ లేదా మీ పేరు ద్వారా లాగిన్ అయ్యి, మీ అకౌంట్ వివరాలు చూసి, సంబంధిత బ్రాంచ్‌కి వెళ్లి కేవైసీ చేసి క్లెయిమ్ ఫారంను సమర్పించాలి. డబ్బు క్లెయిమ్ చేసుకోవడానికి ఎలాంటి టైమ్ లిమిట్ లేదు.