
ఆకాశంలో నెమలి విన్యాసాలు: వైరల్ వీడియో
సాధారణంగా నెమళ్లు నేలపై పురివిప్పి నాట్యం చేస్తాయి. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక నెమలి ఆకాశంలోకి ఎగురుతూ చెట్టుపైకి చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోడ్డుపై ఆహారం వెతుకుతున్న రెండు నెమళ్లలో ఒకటి అకస్మాత్తుగా పైకి ఎగిరి చెట్టుపై వాలింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని @CosmicGaiaX అనే ఖాతా X (ట్విట్టర్)లో సెప్టెంబర్ 22, 2022న షేర్ చేయగా.. ఇది మరోసారి వైరల్ అవుతోంది.




