వచ్చే వారం సెప్టెంబర్ 21 నుంచి 27 మధ్య బ్యాంకులకు పలు సెలవులు ప్రకటించారు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 21న గౌహతి, కొచ్చి, తిరువనంతపురంలో, 22న రాంచీలో, 23న జమ్మూ, శ్రీనగర్‌లో, 25న గాంగ్‌టక్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 26న నాలుగో శనివారం, 27న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అయితే సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.