
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860 పలుకుతోంది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.1,100 పెరిగి రూ. 1,14,450కి చేరింది. ఇక కేజీ వెండిపై రూ.3000 పెరిగి రూ.1,73,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.




