బ్యాంకుల సమ్మె.. ATM లావాదేవీలపై ఛార్జీలు రద్దు చేసిన SBI

15చూసినవారు
బ్యాంకుల సమ్మె.. ATM లావాదేవీలపై ఛార్జీలు రద్దు చేసిన SBI
ఈ నెల 28 నుండి 30 వరకు జరగనున్న బ్యాంకుల సమ్మె నేపథ్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్ల కోసం ఒక కీలక ప్రకటన చేసింది. సమ్మె సమయంలో ఏటీఎం లావాదేవీలపై విధించే ఛార్జీలను SBI రద్దు చేసింది. సాధారణంగా, నెలకు ఐదు ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీకి రూ.10 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు. అయితే, ఈ మూడు రోజుల సమ్మె సమయంలో ఈ ఛార్జీలు వర్తించవు. ఈ నిర్ణయం వల్ల కస్టమర్లు సమ్మె సమయంలో కూడా తమ ఏటీఎం లావాదేవీలను ఎలాంటి అదనపు భారం లేకుండా నిర్వహించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్