
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు
భారత్‌కు వ్యతిరేకంగా వినిపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ హైకమిషనర్ మహమ్మద్ రిజాజ్ హమీదుల్లాకు విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి వస్తున్న బెదిరింపులు, బంగ్లా రాజకీయ నాయకుల నుంచి వస్తున్న విద్వేషపూరిత ప్రకటనలపై భారత్ తన నిరసనను గళమెత్తింది. కాగా, బంగ్లాదేశ్‌లో నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారాయి.




