నీళ్లు నింపితే బ్యారేజీలు కూలిపోతాయి: మంత్రి ఉత్తమ్

26చూసినవారు
నీళ్లు నింపితే బ్యారేజీలు కూలిపోతాయి: మంత్రి ఉత్తమ్
TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే నీటిని అన్నారంలోకి, ఆపై సుందిళ్లకు ఎత్తిపోయాల్సి వస్తుందని, అయితే అక్కడ నీటిని నిల్వ చేయలేమని ఆయన అన్నారు. 3 బ్యారేజీల బేస్‌మెంట్ పనికిరాదని NDSA నివేదిక చెప్పిందని అన్నారు. నీళ్లు నింపితే బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఉందని, దీంతో 44 గ్రామాలు కొట్టుకుపోతాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్