
జంతు బలులు ఆపండి.. చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ
కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు. ఈ నెల 18, 19 తేదీలలో శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద జరగనున్న జంతు బలులను నిషేధించాలని ఆమె కోరారు. ఏటా ఈ ప్రాంతంలో జరుగుతున్న జంతు బలుల గురించి తనకు అనేక లేఖలు వస్తున్నాయని, వేలాది జంతువులను ఎటువంటి కారణం లేకుండానే చంపుతున్నారని మేనకా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.




