క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రీడా జీవితంలోని మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన విజయాల్లో కీలకమైన
క్రికెట్ బ్యాట్‌తో తనకు గల ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "నా దృష్టిలో బ్యాట్ అనేది కేవలం ఒక పరికరం కాదు. దానిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు. అందుకే అతి చిన్న అంశాలపై కూడా నేను ప్రత్యేక శ్రద్ధ వహించేవాడిని" అని సచిన్ పేర్కొన్నారు.