అగ్నితో అమ్మవారి స్నానం.. దర్శిస్తే పక్షవాత రోగాలు మాయం!

14070చూసినవారు
అగ్నితో అమ్మవారి స్నానం.. దర్శిస్తే పక్షవాత రోగాలు మాయం!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఇడాన మాత ఆలయం అగ్నితో స్నానం చేసే అమ్మవారికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నెలకు రెండు, మూడు సార్లు స్వయంగా అగ్ని పుట్టి 10 నుంచి 20 అడుగుల మేర వ్యాపిస్తుంది. ఈ మంటల్లో ఇతర వస్తువులు కాలిపోయినా అమ్మవారి విగ్రహం మాత్రం చెక్కుచెదరదు. ఈ అగ్ని రూపాన్ని దర్శిస్తే పాపాలు తొలగి, పక్షవాతం, మానసిక సమస్యల నుంచి స్వస్థత లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడి త్రిశూలాన్ని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్