
పెళ్లి ఇష్టం లేక డెంటిస్ట్ ఆత్మహత్య
వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని దంతవైద్యురాలు అమృతవర్షిణి (24) కళ్లకుర్చి జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు వివాహ ఏర్పాట్లు చేయడంతో మనస్తాపం చెంది, ఇంటి మేడపై గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తిరుకోవిలూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.




