తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు. అమరవీరుల స్థూపం నుంచి భారీ బతుకమ్మ ర్యాలీ చేపట్టనున్నారు. బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రవీంద్రభారతిలో 10 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోనూ వేడుకలు జరపనున్నారు. బతుకమ్మకు ప్రత్యేక లోగోను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇందులో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంశాన్ని పొందుపరచనున్నారు.