తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పూల డిమాండ్ భారీగా పెరిగింది. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు పూలతో అలంకరించే ఆచారం వల్ల పూలకు గిరాకీ పెరిగింది. బెంగళూరుతో సహా ఇతర ప్రాంతాల నుంచి పూలు దిగుమతి అవుతున్నాయి. వినియోగదారుల ప్రకారం, వినాయక చవితితో పోలిస్తే ఈసారి పూల ధరలు తగ్గాయి. చామంతి పూలు కిలో రూ. 150కి, గులాబీ పూలు రూ. 160-180కి లభిస్తున్నాయి. ఇతర పూల ధరలు కూడా రూ. 200 లోపే ఉన్నాయి.