భారత
క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రతియేటా ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025 పరిధిలోకి రాకపోవడంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రభుత్వ నిధులను తాము తీసుకోలేదని, భారీగా పన్నులు చెల్లిస్తున్నామని బోర్డు వాదిస్తోంది. ఈ పన్ను ప్రకటన వెనుక చట్టం నుంచి మినహాయింపు కోరే వ్యూహం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబర్ 27న ఈ అంశంపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.