TG:
కాంగ్రెస్ నాయకులకు మంత్రి కొండా సురేఖ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారంటూ హెచ్చరించారు. తన కంటే ముందు మాట్లాడిన రెడ్డి నేతలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. పలువురు మంత్రులపై ఆరోపణలున్నాయని, పొంగులేటి, భట్టి భార్యల కమీషన్లపైనా ఫిర్యాదులున్నాయని, వాటికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.