ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌లో ఈ 5 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

7977చూసినవారు
ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌లో ఈ 5 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!
ల్యాప్‌టాప్‌ ఛార్జర్‌ ఎక్కువగా వేడెక్కడం, కేబుల్‌పై కోతలు లేదా లోపలి వైర్లు కనిపించడం, కాలిన వాసన లేదా వింత శబ్దాలు రావడం, ప్లగ్‌ లేదా అడాప్టర్‌పై నల్లటి మచ్చలు, కరిగిన ప్లాస్టిక్‌ కనిపించడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కేబుల్‌ను కదిపినప్పుడు ఛార్జింగ్‌ ఆగిపోవడం లేదా పదేపదే డిస్‌కనెక్ట్‌ అవడం కూడా లోపానికి సూచన కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్జర్‌ను వెంటనే ఉపయోగించడం ఆపి, అవసరమైతే కొత్తదాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్