రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రహదారి రవాణాశాఖ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని తెలిపింది. వీటిలో 38.4 శాతం కార్యాలయాల నుంచి ఇంటికి చేరే సమయంలోనే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. గతంతో పోల్చితే సాయంత్రం 6-9 గంటల మధ్య 18.9 శాతంగా ఉన్న ప్రమాదాలు 20.8 శాతానికి పెరిగాయని కేంద్ర రహదారి రవాణాశాఖ తెలిపింది.