
టీసీఎస్ ఉద్యోగులకు షాక్.. అప్రైజల్స్ నిలిపివేత!
ఐటీ రంగంలో టీసీఎస్ (TCS) కంపెనీ ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని కచ్చితమైన నిబంధన విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని కొన్ని త్రైమాసికాల్లో అటెండెన్స్ నిబంధనలను పాటించని ఉద్యోగుల అప్రైజల్స్ నిలిచిపోయాయి. ముఖ్యంగా కొత్తగా చేరిన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 2022లోనే టీసీఎస్ లాటరల్ హైర్స్ కోసం వార్షిక అప్రైజల్ విధానాన్ని రద్దు చేసింది. నిబంధనలు పాటించకపోతే FY26 బ్యాండింగ్ సైకిల్ నుండి వారిని పూర్తిగా మినహాయిస్తామని కంపెనీ హెచ్చరించింది.




