
విద్యాధికారిని బెల్ట్‌తో కొట్టిన హెడ్ మాస్టర్ (వీడియో)
ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో విద్యాధికారిపై హెడ్ మాస్టర్ దాడి చేశారు. గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ బిజేంద్ర వర్మ తనను వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ టీచర్ ఫిర్యాదు ఆ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాలని బిజేంద్ర వర్మకు బేసిక్ శిక్షాధికారి(BSA) నోటీసులు ఇచ్చారు. ఘటనపై విచారిస్తుండగా ఆగ్రహానికి లోనైన బిజేంద్ర వర్మ విద్యాధికారిని బెల్ట్‌తో కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.




