AP: విశాఖలోని మధురవాడ
క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న ఓ హోటల్లో బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలు బొబ్బిలికి చెందిన షేక్ రెషీదా బేగం(26)గా గుర్తించారు. గదిలో ఉరేసుకుని మహిళ మృతి చెందినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.