ప్రాణం తీసిన బీడీ.. వ్యక్తి సజీవ దహనం

1చూసినవారు
ప్రాణం తీసిన బీడీ.. వ్యక్తి సజీవ దహనం
TG: నిర్మల్ జిల్లా దండేపల్లి మండల పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాగయ్య (55) అనే వ్యక్తి బుధవారం రాత్రి బీడీ పొగ తాగి ఆర్పేయకుండా నిద్రపోయాడు. దీంతో నిప్పు రాజుకుని మంచానికి అంటుకుని మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో నాగయ్య సజీవదహనమయ్యాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you