తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన బీర్ల విక్రయాలు

30చూసినవారు
తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన బీర్ల విక్రయాలు
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల కారణంగా బీర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి బీర్ల అమ్మకాలు 30 శాతం పెరిగాయి, సుమారు 50.78 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వేసవి తాపం ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభుత్వ ఆదాయం మాత్రం తగ్గలేదు. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఒక్కరోజే రూ. 410.87 కోట్ల మద్యం అమ్ముడై రికార్డు సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్