గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?

31చూసినవారు
గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?
భారత కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫొటో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాలేదు. 1949లో విడుదలైన తొలి భారతీయ రూ.1 నోటుపై బ్రిటిష్‌ రాజు చిత్రానికి బదులుగా అశోక సింహాల గుర్తును ముద్రించారు. అప్పటి నోట్లపై జంతువులు, ఆనకట్టలు, పరిశ్రమలు, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రతిబింబించే చిత్రాలకు చోటు కల్పించేవారు. 1969లో గాంధీ శతజయంతి సందర్భంగా తొలిసారి ప్రత్యేక నోటుపై ఆయన చిత్రం వచ్చింది. 1987లో రూ.500 నోటుపై గాంధీ చిత్రం ముద్రించగా.. 1996లో ‘మహాత్మా గాంధీ సిరీస్‌’తో సాధారణ నోట్లపై ఆయన చిత్రం ప్రధానంగా కనిపించడం ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్