TG: యాదగిరిగుట్టపై ఓ యాచకురాలిని కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు యాదగిరిగుట్టకు చెందిన ఈశ్వరమ్మగా గుర్తించారు. పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. యాచకురాలి మృతితో ఆలయం మూసేసి దర్శనాలు నిలిపివేశారు. అధికారులు ఆలయ సంప్రోక్షణ తర్వాత దర్శనాలు పునరుద్ధరిస్తామని తెలిపారు.