ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్‌గా తొలి మహిళ సుసాన్ కోయిలీ నియామకం
Apr 14, 2026, 10:04 IST/

ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్‌గా తొలి మహిళ సుసాన్ కోయిలీ నియామకం

Apr 14, 2026, 10:04 IST
ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుసాన్ కోయిలీని ఆర్మీ చీఫ్‌గా నియమించినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. 125 ఏళ్ల ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు. ఆమె జూలైలో లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టువర్ట్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1987లో ఆర్మీ రిజర్వ్స్‌లో చేరిన సుసాన్ కోయిలీ, ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియాలో విధులు నిర్వర్తించారు. ఇది చారిత్రాత్మక సందర్భమని ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, రక్షణ మంత్రి రిచర్డ్ మార్ల్స్ పేర్కొన్నారు.