రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, చివరి దశలో ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఇప్పటివరకు అయిన ఖర్చు మినహాయించి, మిగిలిన వ్యయాన్ని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. పేదరికమే అర్హతగా పరిగణించాలని కలెక్టర్లకు సూచించారు.