దుర్గాపూజ సమయంలో మాంసాహారం తినరాదని ఇటీవల ఒక హిందూ సాధువు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం సువేందు అధికారి గురువారం కౌశిక్ అమావాస్య సందర్భంగా కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ఫ్రైడ్ ఫిష్, బసంతి పులావ్ భుజించారు. బెంగాల్‌లో కాళీమాతకు చేపలు, మేక మాంసం నైవేద్యంగా పెట్టడం సంప్రదాయమని తెలిపారు. బెంగాలీల ఆహార సంప్రదాయాలపై ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరని, తాను సనాతన హిందువునని సీఎం స్పష్టం చేశారు.