బెంగాలీ నటికి వేధింపులు.. నిందితుడి అరెస్టు

2చూసినవారు
బెంగాలీ నటికి వేధింపులు.. నిందితుడి అరెస్టు
హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద పశ్చిమ బెంగాల్‌కు చెందిన నటి ప్రత్యూషపాల్‌ వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు అబ్దుల్‌ వాజీద్‌ (40)కు నాంపల్లి ఫస్టు జ్యుడిషియల్‌ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.భాస్కర్‌ 7 రోజుల జైలు శిక్ష విధించారు. ఈనెల 2న రాత్రి కుటుంబంతో చార్మినార్‌ను సందర్శిస్తున్న నటిని, టోలిచౌక్‌లో మౌల్వీగా పనిచేస్తున్న అబ్దుల్‌ వాజీద్‌ అనుసరించి అసభ్యంగా ప్రవర్తించాడు. నటి ఫిర్యాదుతో చార్మినార్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్