
ఆఫర్స్ కోసం క్రెడిట్ కార్డు తీసుకుంటే చాలా రిస్క్
బ్యాంకులు రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లతో క్రెడిట్ కార్డ్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఆన్లైన్ ప్రక్రియ సులభతరం కావడంతో, డిస్కౌంట్ల కోసం చాలా మంది బహుళ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. ఈ పద్ధతినే 'క్రెడిట్ కార్డ్ చర్నింగ్' అంటారు. ఆఫర్ ఉన్న కార్డు తీసుకుని, రివార్డులు వాడుకుని రద్దు చేసి, మరో బ్యాంకు నుంచి కొత్త ఆఫర్ కోసం మరో కార్డు తీసుకోవడం దీని ఉద్దేశ్యం. ఇది చట్టవిరుద్ధం కాకపోయినా.. కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.




