తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ సీఐడీ సిట్ అధికారుల ఎదుట హాజరై విచారణ ఎదుర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం హాజరైన విష్ణుప్రియ, బ్యాంక్ అకౌంట్, స్టేట్మెంట్ వివరాలను అధికారులకు అందజేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం, వచ్చిన పారితోషికాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం రానా మాట్లాడుతూ, చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేశానని, లీగల్ టీమ్ పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నానని తెలిపారు.