2026లో భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 25 రాత్రి ప్రారంభమై, సెప్టెంబర్ 26 రాత్రి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, పౌర్ణమి వ్రతం, స్నానం, దానం సెప్టెంబర్ 26, శనివారం నాడు ఆచరించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఆ రోజున ఉదయాన్నే లేదా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల విశేష
ఫలితాలు లభిస్తాయి. పూజ అనంతరం పేదలకు అన్నం, వస్త్రాలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని తెలిపారు.