‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మోడల్ కమ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే, ‘కాంత’, ‘లెనిన్’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాల్లో నటనతో తన మార్కెట్ విలువను పెంచుకున్న భాగ్యశ్రీ, ఇప్పుడు డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నాని నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఖరారైతే, నాని సరసన నటించే అవకాశం భాగ్యశ్రీ కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుంది.