తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన భక్తి చిత్రం 'భక్త కన్నప్ప' విడుదలై నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. భక్తి, ఎమోషన్స్, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లో 70 రోజుల పాటు కష్టతరమైన చిత్రీకరణ జరిగింది. అప్పట్లో రూ.20 లక్షల భారీ బడ్జెట్‌తో నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన తర్వాత అన్ని కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై, అద్భుతమైన స్పందనను అందుకుంది.