తెలంగాణలో మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉష్ణోగ్రతలలో భారీ పెరుగుదల కనిపిస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. పగటి పూట ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు అయిన భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 39°C నుండి 41°C వరకు నమోదు కావొచ్చని అంచనా వేశారు. అలాగే హైదరాబాద్లో 36°C - 37°C వరకు చేరుకునే అవకాశం ఉంది.